భారతదేశం పేద దేశమేనా ????

దేశంలో 96% ఆదాయం కేవలం 1% ధనికులతోనే ఉంది

మిగిలిన 4% ఆదాయం 99% భారతీయులు దగ్గర ఉంది
భారతదేశంలో ఉన్న బిలియనీర్ల ఆదాయం సంవత్సరానికి 39% పెరుగుతుంది

మిగిలిన భారతీయుల ఆదాయం కేవలం సంవత్సరానికి 3% మాత్రమే పెరుగుతుంది
దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ధనికులు ఇంకా ఉన్నతమైన ధనికులుగా ఎదుగుతున్నారు పేదవాళ్ళు ఇంకా దరిద్రమైన కటిక పేదవాళ్లుగా మారుతున్నారు

ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి భారతదేశంలో ఆదాయ అసమానతలు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయో
ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం భారతదేశంలో నేటికీ కనీసం ఒక్క పూట కూడా అన్నం దొరకని పేదవాళ్ళు దేశంలో 33 కోట్ల మంది నిరుపేదలు ఉన్నారు

30 కోట్లమంది భారతీయులు కనీస మౌలిక వసతులు అయినటువంటి త్రాగునీరు సరైన విద్య మెరుగైన వైద్యం అందని అంతమంది పేదవాళ్ళు ఉన్నారు.
ఎన్నికల ముందు నాయకుల ప్రధాన లక్ష్యంగా పేదరికాన్ని రూపుమాపుతామని వాగ్బాణాలు సంధిస్తారు తీరా గెలిచిన తర్వాత పెదాల పైనా పేపర్ల పైనా పేదరికాన్ని నిర్మూలిస్తారు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పేదరికాన్ని అంతం చేయాలి అంతమొందించే లా అధికారపక్షం చర్యలు చేపట్టాలని రాస్తారోకోలు ధర్నాలు బందులు పాటిస్తూ జనం కోసం వచ్చిన పార్టీగా జనాల్లో భ్రమను కలిగిస్తారు తీరా వాళ్లు కూడా అధికారంలోకి వచ్చాక తమ అనునయులకు పార్టీ నాయకులకు మాత్రమే లబ్ధి చేకూరుస్తున్నారు
49 సంవత్సరాల క్రితం 1971 ఎన్నికల ప్రచారంలో ఇందిరాగాంధీ గారు

"గరీబీ హటావో దేశ్ బచావో" అని పిలుపునిచ్చారు అఖండ మెజారిటీ తో గెలిచారు చెప్పిన విధంగానే పేదరికం నిర్మూలన కోసం ఏవేవో పథకాలు ప్రవేశపెట్టారు కానీ చిత్తశుద్ధిలేని పథకాల ప్రవేశం సత్ఫలితాలను ఎన్నటికీ ఇవ్వదు
అదే గరీబీ హటావో దేశ్ బచావో నినాదంతో రాజీవ్ గాంధీ వచ్చారు రాహుల్ గాంధీ గారు కూడా 2019 ఎన్నికల్లో వచ్చారు కానీ పాలనలో చిత్తశుద్ధిలేని కుటుంబ పాలన మళ్లీ చూడడం ఇష్టం లేని భారతీయులు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించేశారు
భారతదేశ రాజకీయ చరిత్రలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి గా ఎన్నికైన మొరార్జీ దేశాయ్ గారు కూడా ఉన్న రెండు సంవత్సరాలు పేదరికం పై పోరాటం చేయలేకపోయారు.
ఇప్పటికే 2014 నుంచి 2020 వరకు ఆరు సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకుంటున్న భారతీయ జనతా పార్టీ అయినా దేశంలో పేదరిక నిర్మూలనకు తగిన విధమైన పథకాలను ప్రవేశపెట్టి ఆ పథకాలను సరైన రీతిలో అసలైన లబ్ధిదారులకు చేరవేసే విధంగా చర్యలు తీసుకుంటుందని తీసుకోవాలని కోరుతున్న కోరుకుంటున్నా https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏" title="Folded hands" aria-label="Emoji: Folded hands">https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏" title="Folded hands" aria-label="Emoji: Folded hands">https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏" title="Folded hands" aria-label="Emoji: Folded hands">
మనలాంటి ప్రజలకు పేదరికం ఎప్పుడు కనిపిస్తుందో తెలుసా బస్టాండ్లో రైల్వే స్టేషన్లో నిలుచున్నప్పుడు, 60-90 వేగంతో రోడ్లపైన బైక్లోను కారులోనూ వెళ్తూ రోడ్డు పక్కన చిన్న గుడారాల్లో జీవిస్తున్న వాళ్ళని చూసినప్పుడు అప్పుడు అనిపిస్తుంది మన దేశంలో కూడా ఇంకా పేదరికం ఉంది అని
జైహింద్ https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="♥️" title="Heart suit" aria-label="Emoji: Heart suit">https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🇮🇳" title="Flag of India" aria-label="Emoji: Flag of India">https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="♥️" title="Heart suit" aria-label="Emoji: Heart suit">
You can follow @chandrasekarJSP.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: