చెన్నై నుంచి కడప కి నంద్యాల డిపో సూపర్ లగ్జరీ బండి లో వచ్చాను. వారాంతం కావడం, బస్సు నిండిపోయింది. నా అదృష్టమేమో, టీవీ పనిచెయ్యలేదు. లేకపోతే ఏ బాలయ్య బాబు సినిమా నో వేసి ప్రాణం తీసుండేవారు... పెరియపాళ్యం దగ్గర భోజనం చేశాక తీసిన ఫోటో. #apsrtc #యాత్ర
కడపకి తెల్లవారుఝామున మూడింటికి చేరుకున్నాను. రాత్రి ఏదో ఆలోచనలో పడి నిద్రపోలేదు.. బస్టాండులో నిద్రపోడానికి వసతులున్నయేమో చుద్దమనుకునెలోపల ఈ బస్సు కనిపించింది. కండక్టర్ ఉండటం సౌకర్యమంట. #apsrtc #యాత్ర
యాభై రూపాయలకి మంచం, లాకర్ దొరికాయి. ఫోన్, పవర్ బ్యాంక్ ఛార్జింగ్ లో పెట్టి నిద్రపోయాను. లెగిచి మొహం కడుక్కోగానే ఈ బస్సు కనిపించింది. శుభోదయం.
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="😊" title="Smiling face with smiling eyes" aria-label="Emoji: Smiling face with smiling eyes"> #apsrtc #యాత్ర
టిఫిన్ తిని పులివెందుల బస్సు కోసం ఎదురు చూస్తుండగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ బళ్ళు పక్క పక్కనే కనిపించాయి. ఫోటో తీస్తుండగా కండక్టర్ గారు ఎందుకు తీస్తున్నావని అడిగారు. బస్సులంటే ఇష్టమని చెప్తే నాకు నువ్విష్టమని చెప్పి అభిమానం గా హత్తుకున్నారు. మన సంస్థ బంగారం
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🤗" title="Hugging face" aria-label="Emoji: Hugging face"> #apsrtc #యాత్ర
కడప - పులివెందుల మార్గం లో అన్నీ అద్దె బస్సులే ఉన్నట్టున్నాయి. డ్రైవర్ గారు నిదానం గానే తీసుకెళ్తున్నారు. ఇదిగో.. టికెట్టు. ఉంకొ వారం లో ముద్రించినదంతా మాయమైపోతుంది. గుర్తు కి ఫోటో. #apsrtc #యాత్ర
ద్వారం దగ్గర చీటీ తీసేసుకున్నారు.. ముందే ఫోటో తీసి పెట్టుకున్నా. మరికొద్దిసేపట్లో చిత్ర ప్రదర్శన మొదలౌతుంది. ఈ హాల్లో ఇంకా బెంచీలు, నేల టిక్కెట్లు ఉన్నాయి
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="😊" title="Smiling face with smiling eyes" aria-label="Emoji: Smiling face with smiling eyes"> రెండో రోజు కదా.. చెక్క కుర్చీకి వంద రూపాయలు తీసుకున్నారు. #యాత్ర
విరామం. పాటలు బాగున్నాయి. మముట్టీ రాజశేఖర్ రెడ్డి ని అనుకరించకుండా చాలా బాగా నటించారు. కథ రైతు దీక్ష దాకా వచ్చింది. ఇక ముందేముందో.. #యాత్ర
సమాప్తం.. రాజన్న మాత్రమే రాజు, మేలిమి బంగారం.. ఆఖరి సన్నివేశం లో జగనన్న కనిపించారు. వెనుక మరిగైనావ రాజన్న పాట. సినిమా కాదు సాక్షి టీవి చూస్తున్నట్టు అనిపించింది. #యాత్ర
పులివెందుల నుంచి వేంపల్లి మీదుగా గండి కి వెళ్ళాను.. ఇక్కడ పాపాగ్ని నదిలో స్నానాలు చెయ్యడం ఆనవాయితీ అంట. కానీ ఈ నది చాలా రోజులుగా ఎండిపోయి ఉంది. ఇలా.. #యాత్ర
అసలు ఇటువైపు వచ్చినది ఇడుపులపాయ కి వెళ్దామని. అయితే రాజశేఖర్ రెడ్డి స్మృతి వనం కి వెళ్ళడానికి రోజుకి రెండు బస్సులు మాత్రమే ఉన్నాయి. సాయంకాలం బస్సు తప్పిపోయింది. అయితే ఏం, IIIT విద్యార్థుల మహిమా అని షేర్ ఆటోలు బానే ఉన్నాయి. ఆరు కిలోమీటర్లకు పది రూపాయలు. ఇందులో.. #యాత్ర
జోహార్ వైఎస్సాఆర్ #యాత్ర
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏" title="Folded hands" aria-label="Emoji: Folded hands">
వేంపల్లె నుంచి బెంగళూరు కి ప్రయాణం ప్రారంభం. ఇక్కడినుంచి రాత్రి పదిన్నర కి బస్సు ఉంది కానీ అప్పటిదాకా ఆగే ఓపిక లే కుండె. ప్రొద్దుటూరు వెళ్లి చాలా రోజులైంది. సాయంకాలం , తెలుగు వెలుగు ప్రయాణం.. ఇంకేం కావాలి. dooramautundani తెలిసి కూడా ఎక్కేసాను..
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="😊" title="Smiling face with smiling eyes" aria-label="Emoji: Smiling face with smiling eyes"> #యాత్ర
ప్రొద్దుటూరు నుంచి బెంగళూరు కి రాత్రి తొమ్మిదింటి బస్సు లో టిక్కెట్టు తేస్కున్నా.. OPRS బాధ్యతలు అవుట్ సోర్సింగ్ చేశారు. టిక్కెట్టు మామూలు పేపర్ మీద ఇస్తున్నారు. నా వయస్సు సున్నా అంట
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🤫" title="Shushing face" aria-label="Emoji: Shushing face"> #apsrtc #యాత్ర