మనసులో మాట..

మన దేశానికి నలుదిక్కుల ఉన్న దేశాలతో కలిసి చైనా ఉచ్చు బిగిస్తుంది అన్న విషయం దేశ పరిస్థితుల మీద కొంచెం అవగాహన ఉన్నోళ్ళకైనా అర్థం అవుతుంది.. మనకి కుడి ఎడమల ఉన్న పాకిస్థాన్, నేపాల్ ఇప్పుడు పూర్తిగా చైనా కంట్రోల్ లోనే ఉన్నాయ్.. 1/12

@KTRTRS
ఇపుడు కింద శ్రీలంక కూడా మెల్లగా చైనా కంట్రోల్ లోకే వెళ్ళిపోతుంది.. ఇంకా మిగిలినవి బాంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్.. రోహింగ్యాల సమస్యతో, CAA చట్టంతో బాంగ్లాదేశ్ ఎంతో కొంత మన మీద బయటికి కనిపించని వ్యతిరేకతతోనే ఉంది..2/12
పైగా బంగ్లాదేశ్లో చైనా పెట్టుబడులుకూడా ఉన్నాయికాబట్టి దాన్ని కంట్రోల్ చెయ్యడం కూడా చైనా కి పెద్ద కష్టం కాకపోవచ్చు. మయన్మార్లో ప్రస్తుత రాజకీయ అనిశ్చితిని వాడుకోవడం చైనా కి వెన్నతో పెట్టిన విద్య.. ఒక్క భూటాన్ ఒక్కటే కొంతలో కొంత నయం అని నాకున్న అవగాహన..3/12
బుద్ది ఉన్నోడు ఎవడైనా మనకు ఆనుకొని ఉన్న దేశాలతో సత్సంబంధాలు పెట్టుకొని వాళ్ళని మనకి రక్షణ కవచంలా వాడుకుంటాడా లేకపోతె మత రాజకీయాలు చేస్తూ, రెచ్చగొడుతూ, వాళ్లకి కూడా శత్రువై, ఆర్థికంగా పెద్దన్నగా అవతరించబోయే చైనాకి ఇంకా ఎక్కువ అవకాశం ఇస్తాడా? 4/12
ట్రంప్ ని సంకలో వెస్కొని తిరిగితే అమెరికా వచ్చి మన తరుపున యుద్ధం చేస్తదా రేపు యుద్ధం వస్తే? అలాంటి దేశాలు తమ దేశ ప్రయోజనాలకోసమే పనిచేస్తాయి, తటస్తంగా ఉంటాయి, అవసరం అయితే వదిలేస్తాయి కూడా.. అమెరికా అలా ప్లేటు ఫిరాయించిన ఉదహారణలు ఎన్ని చూడలేదు మనం?? 5/12
నిజంగానే మనం ఆర్థికంగా ఎప్పుడూలేనంత బలంగా ఉన్నాం అని, చైనా కి మనం ఏం తక్కువకాదు అని మన 56 ఇంచుల ఛాతి ఉన్న ప్రధాని గారు చెప్పేది నిజం అయితే, మన సరిహద్దు దేశాలతో చైనా పోషిస్తున్న పాత్ర మనం పోషించి వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవచ్చు కదా? 6/12
చైనా మనదేశంలో ఒక వూరే కడుతుంటే ఆపలేకపోయారు, పైగా చైనా మూలాలున్న బ్యాంకులనుండే అప్పులు తీసుకున్నారు.. కాబట్టి మన ఆర్థిక స్థిరత్వం ఏపాటిదో, మన కళ్ళ ముందు కనిపిస్తున్న అప్పులు, జీడీపీ కుంగుబాటుతో అర్థం అవుతూనే ఉంది..7/12
యుద్దానికి కావాల్సిన అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకోవడం ఎంత అవసరమో, మన సరిహద్దు దేశాలని మన కంట్రోల్ లో పెట్టుకొని, సత్సంబంధాలు నెరుపుతూ అవసరం వచ్చినపుడు వాళ్ళు మనకి రక్షణ కవచంలా అండగా నిలబడేలా చేస్కోవడం అంతకన్నా ఎక్కువ అవసరం..8/12
మన దేశాన్ని కాపాడుకోవడానికి యువత గన్ను పట్టుకొని పోయి యుద్ధం చేయక్కర్లేదు, దేశానికి స్థిరమనైన ప్రభుత్వాన్ని ఇచ్చే పార్టీని మాత్రమే కాకుండా, దేశాన్ని ఆర్థికంగా పటిష్టపరుస్తూ, దేశంలో ఉన్న అన్ని కులాల మతాల ప్రజల విశ్వాలను గౌరవిస్తూ పాలించే పార్టీని ఎన్నుకోవాలి.. 9/12
ఇంట గెలిచి రచ్చగెలువు అన్నట్లు, ముందు ఇంట్లోవాళ్ళని గౌరవించడం నేర్చుకుంటే, ఆటోమేటిక్ గా మన సరిహద్దు దేశాలతో అలాగే ప్రవర్తిస్తాం, మన ఆర్థిక స్థిరత్వంకోసం ఏదేశానికి లేని మనకి మాత్రమే ఉన్న అపారమైన యువశక్తిని ఎలా వాడుకోవాలో ఆలోచిస్తాం. 10/12
ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలేంటో, స్వార్థ ప్రయోజనాలేంటో, వాళ్లకున్న అధికార వ్యామోహమేంటో, వ్యాపార మూలాలున్న నాయకుల ఆలోచనా ధోరణి ఎలా ఉంటుందో ఆలోంచించి మేల్కొనకపోతే మనం ఊహించని నష్టం కష్టం చవిచూడాల్సి వొస్తుంది.. 11/12
కాబట్టి, ఆలోచిద్దాం. అభివృద్ధిని చూసి ఓటేద్దాం.. మతంకన్నా మానవత్వం గొప్పది అనేలా, సర్వేజనా సుఖినోభవంతు అని ప్రపంచానికి చాటి చెప్పిన మన దేశ ఔన్నత్యాన్ని చాటేలా పాలించే నాయకున్ని ఎన్నుకుందాం. అలాంటి నాయకుడు ప్రస్తుత పరిస్థితులలో నాకు కెసిఆర్ తప్ప ఇంకెవరు కనిపించట్లేదు. జై హింద్..✊
You can follow @SkWarangal.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.