రైతు చట్టాలలో ఉన్న ముఖ్యమైన లోపాలు - నా అభిప్రాయాలు:

ఈ త్రెడ్ పూర్తిగా చదవండి.

అవసరానికి, అర్హతకు మించి ఆహార పదార్థాలు నిల్వచేయడం చట్టరీత్య నేరం, శాస్త్ర ప్రకారం పాపం. కానీ ఈ చట్టాల ద్వారా నేరమూ కాదు, పాపం అంతకన్నా కాదు.

@KTRTRS @SingireddyTRS
అత్యవసర వస్తువులనుండి ఆహార పదార్థాలను మినహాయించడం వల్ల, ప్రైవేట్ కంపెనీలు ఆహార పదార్థాల కృత్రిమ కొరత సృష్టించే వెసులుబాటు కలుగుతుంది. అలాంటి సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరి దగ్గర నిల్వ ఉన్నాయో తెలిసి కూడా చర్యలు తీసుకోలేనివిధంగా చట్టాలు రూపొందించబడ్డాయి.
ఒకసంవత్సరంలో ధర రెట్టింపు అయితేనే ప్రభుత్వం కలుగ చేసుకుంటుంది. అంటే సంవత్సరం నిల్వ చేసుకొని తర్వాత రెట్టింపు ధరకు అమ్ముకుంటే నేరమూ కాదు, ప్రభుత్వం కలుగజేసుకోనూ లేదు..
అధిక సామర్థ్యంగల నిల్వగిడ్డంగులను కార్పొరేట్ కంపెనీలు నిర్మించుకుంటాయి కాబట్టి, ఆహార పదార్థాలను నిల్వచేసుకొని, కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరకి అమ్ముకుంటూ, రైతుతో చేసుకున్న ఒప్పందం ప్రకారం, MSP కి కూడా చట్టబద్దత లేదు కాబట్టి తక్కువ ధరకే రైతు దగ్గర పంటను కొనే ఆస్కారముంది.
రైతుకు తోడ్పాటు అన్న పేరుతో తనకి కావాల్సిన ఎరువులు యంత్ర సామాగ్రి వగైరా సమకూరుస్తాడు కాబట్టి, కార్పొరేట్ యజమాని చెప్పిన ధరకి రైతు పంటని అమ్మవలసిందే.ఒకరకంగా, రైతుని కూలీగా మార్చుకొని,తనతో వెట్టిచాకిరి చేయించుకొని,అతి తక్కువ ధరకి పండించి అత్యధిక ధరకి అమ్ముకొనే రాచమార్గం ఈ చట్టాలు.
లాభాపేక్ష కలిగిన కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ పెట్టుబడి మీద లాభాలు ఆశించకుండా రైతుని లక్షాధికారిని చెయ్యడానికి వారు అడిగినంత ధర ఇచ్చి పంట కొనుక్కోవాలి అని అర్థం వచ్చేలా ఒక్క ముక్క కూడా లేని చట్టాల వల్ల రైతు ఏవిధంగా ఈ చట్టాలతో లక్షాధికారి అవుతాడో ఆ చట్టం చేసిన పెద్దలకే తెలియాలి.
ప్రపంచంలో ఏ ఉత్పత్తిరంగంలో చూడని ఆత్మహత్యలు కేవలం పంటలను ఉత్పత్తి చేసే రైతులలోనే చూసాం.దీన్నిబట్టే వాళ్ళు ఆర్థికంగా ఎంత చితికిపోయి ఉన్నారో అర్థం అవుతుంది. 90% పైగా సన్నకారు రైతులున్న మన దేశంలో అలాంటి ఆర్ధిక బలంలేని రైతు బడా కార్పొరేట్ యాజమాన్యాలతో ఎలా న్యాయమైన వ్యాపారం చేస్తాడు?
అంబానీ అదానీలాంటి కార్పొరేట్ పెద్దలకి నిజంగానే రైతులమీద ప్రేమ ఉంటె, కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళే రైతులను ఉద్ధరిస్తారు అన్న నమ్మకం ఉంటె, ప్రతి గ్రామంలో వాళ్ళ కొనుగోలు కేంద్రం పెట్టి రైతు అడిగినంత ధర ఇచ్చి, లేదా MSP కి 50% అధికంగా చెల్లించి పంటని కొనుక్కెళ్లొచ్చు కదా? చట్టాలెందుకు?
ప్రైవేటీకరణ వల్ల పోటీతత్వం పెరిగి ప్రజలకి నాణ్యమైన సేవలు అందాయేమోగాని ధరలు తగ్గి ప్రజలు బాగు పడ్డది ఏ రంగమూ లేదు. విద్య, విద్య రంగాలే మంచి ఉదాహరణలు. ఆ ప్రైవేట్ సంస్థల్ని స్థాపించిన యాజమాన్యాలు బాగుపడ్డయిగాని అందులో పని చేసే ఉద్యోగులు కాదు, ఆ సేవలు కొనుక్కుంటున్న ప్రజలూ కాదు.
ఇప్పుడు ఈ రైతు బిల్లుల వల్ల జరగబోయేది కూడా అదే.. రైతులు కూలీలుగా మారుతారు, ప్రైవేట్ యాజామాన్యాలు ఇంకా అధిక ధనవంతులు అవుతారు, షరామామూలుగా ప్రజల జేబుకు చిల్లు పడుతుంది.
ఆలోచిద్దాం.. రైతన్నకు అండగా నిలబడదాం..
దేశానికి వెన్నెముక ఐన రైతన్నకు కావాల్సింది ఒప్పందపు చట్టాలు కాదు, ప్రైవేట్ యాజమాన్యాల దయాదాక్షీన్యాలు అంతకన్నా కాదు..
పంటవేయడానికి ఆర్ధిక సహాయం, పంటకు కావాల్సిన నీరు, విద్యుత్, ఎరువులు ఉచితంగా అందించడం, చేతికొచ్చిన పంటను తన మోహంలో చిరునవ్వు నింపే ధరకి కొనడం, ప్రమాదవశాత్తు జరగరానిది జరిగితే తన కుటుంబానికి అండగా నిలవడం.
ఇదే ఒక వ్యాపారి ప్రజా పాలకుడు అయ్యి చేసిన చట్టాలకు, ఒక రైతు ప్రజాపాలకుడు అయ్యి సృష్టించిన పథకాలకు అచ్చమైన తేడా.. అందుకే నేను గర్వంగా చెప్తా, రైతు బిడ్డ కెసిఆర్ గారు జిందాబాద్.. 🙏🙏✊
@KTRTRS @SingireddyTRS
You can follow @SkWarangal.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.